భారతదేశం, అక్టోబర్ 31 -- తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎలాంటి ఫైన్ లేకుండా అక్టోబర్ 30వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఈ గడువును నవంబర్ 6వ తేదీ వరకు పొడిగించారు. అంటే ఎలాంటి ఫైన్ లేకుండా నిర్దేశించిన ఫీజుతోనే అప్లయ్ చేసుకోవచ్చు.

నవంబర్ 14వ తేదీ వరకు రూ.1,500 ఫైన్ తో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్‌ 19 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.3వేల అపరాధ రుసుముతో నవంబర్‌ 21 తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. సాధారణ ఫీజు కింద అయితే. ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు. ...