భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణ సెట్(TS SET-2025) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలస్య రుసుంతో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. పరీక్ష తేదీలను ఖరారు చేసూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

టీజీ సెట్ - 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 12వ తేదీతో అన్ని సబ్జెక్టుల పేపర్లు పూర్తవుతాయని. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. http://telanganaset.org/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ సెట్ - 2025 పరీక్ష కోసం నవంబర్ 14వ తేదీ వరకు రూ.1,500 ఫైన్ తో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్‌ 19 వరకు రూ.2వేల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

ఇ...