భారతదేశం, డిసెంబర్ 10 -- తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎగ్జామ్ నిర్వహణపై కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. డిసెంబర్ 10 నుంచి 12 తేదీ వరకు సెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు కొత్త తేదీలను ప్రకటించారు.

ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.

Published by HT...