భారతదేశం, డిసెంబర్ 13 -- తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025పై అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఎగ్జామ్ నిర్వహణపై కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అయితే తాజాగా పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. సబ్జెక్టుల వారీగా ఏ పరీక్ష ఎప్పుడనే వివరాలను పేర్కొంది.

డిసెంబర్ 22వ తేదీన ఉదయం ఒక సెషన్ లో కొన్ని సబ్జెక్టులు, మధ్యాహ్నం జరిగే రెండో సెషన్ లో మరికొన్నిసబ్జెక్టుల పేపర్లు జరుగుతాయి. మొదటి రోజు జియాగ్రఫీ, జర్నలిజం,సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్ పేపర్లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ ఉంటాయి. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి షెడ్యూల్ చూడొచ్చు.

ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్...