భారతదేశం, మార్చి 11 -- ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాశక్తి సభలో సీఎం రేవంత్‌ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాలు, పాఠశాలలకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పోషకాహార పంపిణీ చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి రంగం సిద్ధమవుతోంది.

ఇప్పుడు ఉన్న గుత్తేదార్ల వ్యవస్థను తొలగించి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మహిళా సంఘాల ద్వారా పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం కోసం విధివిధానాలను రూపొందించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌లను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో సెర్ప్‌ కార్యాచరణ రూపొందిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పుడు వసతిగృహాలకు, గురుకులాలకు ఆహార వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. చాలామంది కుళ్లిన, ముదిరిన కూ...