భారతదేశం, ఫిబ్రవరి 27 -- విద్యార్థులకు మార్చి నెలలో మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి. ఇదే నెలలో ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. మార్చిలో హోలీ, ఉగాది, రంజాన్ పండగలు ఉన్నాయి. ఈ మూడు రోజులు పోనూ.. రెండో శనివారం, ఆదివారాలతో కలిపి.. మొత్తం 8 రోజులు హాలిడేస్ రానున్నాయి.

2వ తేదీన మొదటి ఆదివారం సెలవు ఉంది. ఆ తర్వాత 8వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఈరోజు కూడా స్కూల్స్‌కు హాలిడే ఉంటుంది. 9వ తేదీ ఆదివారం. ఇక మార్చి 14వ తేదీ శుక్రవారం హోలీ పండగ ఉంది. 16వ తేదీ సండే. ఈ వారంలో మధ్యలో సెలవులు లేవు. మళ్లీ 23వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ తర్వాత 30, 31వ తేదీల్లో సెలవులు వచ్చాయి.

30వ తేదీ ఆదివారం (ఇదే రోజు ఉగాది పండగ ఉంది). 31వ తేదీ సోమవారం రంజాన్ పండగ ఉంది. ఈ రెండు రోజులు వరుస సెలవులు రానున్నాయి. 8వ తేదీ రెండో శనివారం, ...