Telangana,andhrapradesh, ఏప్రిల్ 9 -- వేసవి సెలవులు రాకముందే. తెలంగాణలోని విద్యార్థులకు మరో శుభవార్త వచ్చేసింది. ఈ ఏప్రిల్ నెలలో వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు అని తెలియటంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు.

ఈ ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు పిల్లలకు సెలవులు ఉండనున్నాయి. 12వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు ఉంది. మరునాడు ఆదివారం కావడంతో మరో హాలిడే వచ్చింది. ఇలా రెండు కాకుండా.. సోమవారం రోజు బీఆర్ అంబేద్కర్ జయంతి ఉంటుంది. ఈ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పిల్లలకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లు అయింది.

ఇక ఈ ఏప్రిల్ నెలలో చూస్తే.. ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 ...