భారతదేశం, ఫిబ్రవరి 4 -- TG SC Classification : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఎస్సీలలో 59 ఉప కులాలను గుర్తించినట్లు తెలిపింది. ఎస్సీలను గ్రూప్‌-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసులు చేసింది. గ్రూప్‌-1లోని 15 ఉపకులాల జనాభా 3.288 శాతం కాగా వీరికి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కమిషన్ సూచించింది.

అలాగే గ్రూప్‌-2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748 శాతం కాగా వీరికి 9శాతం రిజర్వేషన్‌, గ్రూప్‌-3లోని ఎస్సీ 26 ఉపకులాల జనాభా 33.963 శాతం కాగా వీరికి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వర్గీకరణ కమిషన్‌ నివేదికలో పేర్కొంది. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.

తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ హాలులో సీఎం రేవంత్ రె...