భారతదేశం, ఫిబ్రవరి 5 -- TG SC Categorisation: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఎస్సీ ఉపకులాల వారీగా దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించారు. పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యామం డలి జారీ చేసిన నోటిఫికేష...