భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని చాలా రేషన్ షాపుల్లో అంతలోనే సన్నబియ్యం అయిపోయాయి. అలా వచ్చాయో లేదో ఇలా పంపిణీ చేసేశారు. కానీ లబ్ధిదారులు మాత్రం తమకు సన్న బియ్యం రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించగా.. కార్డుదారులు ఆశగా రేషన్‌ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడికెళ్లాక బియ్యం అయిపోయాయి.. వస్తాయనే సమాధానం వినిపిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి అరకొర కేటాయింపులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో మూవ్‌మెంట్‌ కావడం లేదు. దీంతో నగర ప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం వరకే సన్న బియ్యం వచ్చినట్టు తెలుస్తోంది. రేషన్‌ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో డీలర్లకు బాధలు తప్పడం లేదు. కొంత బియ్యం ఒకసారి మరికొంత బియ్యం మరోసారి పంపిస్తుండటంతో సాధ్...