భారతదేశం, ఏప్రిల్ 5 -- సన్న బియ్యం ప్రక్రియ రేషన్‌ డీలర్లకు తలనొప్పిగా మారింది. బియ్యం సంచుల్లో తరుగు వస్తోందని.. దీంతో నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో బస్తాకు 2 కిలోల వరకు బియ్యం తగ్గుతోందని వాపోతున్నారు. గత నెల వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో.. చాలా మంది వినియోగదారులు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపలేదు.

1.గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకెళ్లేవారు కాదు. డీలర్ల వద్దనే ఉండిపోవడం, లేకుంటే వారికే విక్రయించడంతో సంచుల్లో తరుగు వచ్చినా డీలర్లు భరించారు.

2.ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో.. కార్డుదారులందరూ తీసుకెళ్తున్నారు. దీంతో బస్తాల్లో తూకం వ్యత్యాసంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని డీలర్లు వాపోతున్నారు.

3.ధాన్యం మర పట్టిన తర్వాత బియ్యాన్ని సక్రమంగా తూకం వేయకపోవ...