భారతదేశం, మార్చి 30 -- TG Sanna Biyam Distribution : తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి లబ్దిదారులకు సన్నబియ్యం అందించారు. ఏప్రిల్‌ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు సీఎస్‌ శాంతికుమారి ప్రకటించారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2800 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.

ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం ఎంతో సంతోషకంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శ్రీమంతులు ...