భారతదేశం, ఫిబ్రవరి 17 -- తెలంగాణలో ఇసుక కొరతను తీర్చేందుకు రేవంత్ సర్కారు చర్యలు చేపట్టింది. 24 గంటలు ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎండీసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.రాష్ట్రంలో ప్రస్తుతం చాలాచోట్ల టీజీఎండీసీ ఇసుక రీచ్‌లను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆయా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది.

2.గతంలో ప్రభుత్వ రీచ్‌లు, డంపింగ్‌ యార్డుల్లోని ఇసుక నిల్వల వివరాలను రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచేవారు. 12 తర్వాతే ఇసుక బుకింగ్‌కు అవకాశమిచ్చేవారు.

3.ఈ విధానాన్ని మార్చుతూ.. 24 గంటల ఆన్‌లైన్‌ విధా...