భారతదేశం, ఏప్రిల్ 11 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ.. సీఎం కాకముందు కూడా ఎక్కువగా రైతుల కోసం ఆలోచన చేసేవారు.. అని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి కొనియాడారు. రైతు బిడ్డ కాబట్టే రేవంత్ రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని వివరించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతు మహోత్సవం -2025 కార్యక్రమాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడారు.

'ఈ అగ్రీ, హార్టీ సొసైటీలో ఉన్నవారంతా వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్నవారే. శాస్త్రవేత్తలు, అధికారులు రిటైర్ అయిన తర్వాత ఇందులో కొనసాగడం అభినందించదగ్గ విషయం. రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఆషామాషీ కాదు. నేను కూడా ఊహించలేదు. సన్న, చిన్న...