భారతదేశం, ఫిబ్రవరి 18 -- అర్హులైన అన్నదాతలకు మార్చి నెల మొదటి వారంలోగా.. రైతు భరోసా సాయం విడుదల చేయాలని.. ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విడతల వారీగా నిధులు విడుదలైనా.. ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సచివాలయంలో రైతు భరోసాపై ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పటి వరకు మూడు ఎకరాలున్న వారికి సాయం అందించామని అధికారులు మంత్రులకు వివరించారు. కొత్త పాస్‌ పుస్తకాలున్న వారి బ్యాంకు ఖాతాల పరిశీలన జరుగుతుందని.. వారికి నిధులు జమ కాలేదని చెప్పారు. అయితే.. కొత్త పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల ఖాతాల్లో వెంటనే నిధులు చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి.. రైతుభరోసా సమస్యలను పరిష్కరించాలని ఆదేశ...