భారతదేశం, జనవరి 2 -- రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. పంట పండించే ప్రతి రైతుకు.. రైతుభరోసా ఇవ్వాలని చర్చ భేటీలో చర్చ జరిగింది. రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించనుంది. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు చేయని భూములు తీసేస్తే.. కోటి 30 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా పథకం అమలుపై సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 3వ తేదీన (శుక్రవారం) కలవనున్నారు. శనివారం కేబినెట్‌లో రైతు భరోసాపై తుది నిర...