భారతదేశం, జనవరి 30 -- తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల అభివృద్ధికి.. జిల్లాల వారీగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 27,700 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు ఉన్నాయి. ఇందులో 25,643 కిలో మీటర్ల బీటీ, 882 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉన్నాయి. మిగతావి కంకర, మట్టి రోడ్లు ఉన్నాయి. వీటిల్లో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని.. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.గత కొన్నేళ్లుగా గ్రామాల్లో పలు చోట్ల రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గత ఏడాది భారీ వర్షాలకు పలు జిల్లాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గతంలో రోడ్లపై నిర్వహిం...