భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కొనాలనుకునేవారికి తెలంగాణ రెరా కీలక సూచనలు చేసింది. రెరా రిజిస్ట్రేషన్ వివరాలను చెక్ చేసుకున్న తర్వాతనే. కొనుగోలు విషయంలో ముందుకెళ్లాలని సూచించింది.

రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ప్రాజెక్ట్(వెంచర్) వివరాలు, లేఅవుట్ ప్లాన్, యాజమాన్యపు హక్కులు మరియు సంబంధిత బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక వెబ్ సైట్ https://rera.telangana.gov.in/ లో సరిచూసుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పూర్తి వివరాలను సరి చూసుకున్న తర్వాతనే. ఇళ్లు లేదా ప్లాట్లు కొనాలని స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో ప్రీ-లాంచ్ ఆఫర్లు లేదా ఈఓఐ వంటివి చట్టవిరుద్ధమని రెరా స్పష్టం చేసింది. ఇలాంటి అక్రమాలపై 040-29394972 (ఫోన్), 9000006301 (వాట్సాప్) లేదా rera-maud@telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అథారిటీ స్పష్టం...