భారతదేశం, ఏప్రిల్ 8 -- TG Registrations : తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రాన్ ఆఫీసులను ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్రజలకు వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానాన్ని అందుబాటులో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ 10 నుంచి రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ముందుగా 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌తో 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుందని తెలిపారు. తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ https://registration.telang...