భారతదేశం, ఫిబ్రవరి 11 -- TG Ration Cards: తెలంగాణలో మళ్లీ రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే పలు విడతలుగా దరఖాస్తులుగా స్వీకరించిన కొత్త కార్డులు మాత్రం జారీ కాలేదు. తాజాగా మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

రేషన్ కార్డుల జారీ విషయంలో గందరగోళం నెలకొనడంతో సివిల్ సప్లైస్ శాఖ దరఖాస్తుల విషయంలో అధికారికంగా స్ఫష్టత ఇచ్చింది. కొత్త దరఖాస్తులు స్వీక రించడానికి మీసేవ ఆధికారులతో చర్చించి నిర్ణయించారు. వెబ్‌సైట్‌లో ' దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ పునరుద్ధరించారు. మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం మొదలైంది.

రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు చేసే విషయంలో గందరగోళం జనం అవస్థలు పడ్డారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిం చేందుకు మీ-సేవ వెబ్‌సైట్‌లో ఆప్షన్ అంద...