భారతదేశం, ఫిబ్రవరి 5 -- TG Ration cards: తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డులు ఇచ్చారు. కార్డులుళమ పొందిన వారందరికీ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 63 మండలాలు, 14 పురపాలికలు, రెండు నగర పాలక సంస్థలు గ్రామ, వార్డు సభలు నిర్వహించి జాబితాలో ఉన్నవారి పేర్లను చదివి వినిపించారు. ఆ తర్వాత గతనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 1,608 మందికి రేషన్ కార్డులు అందజేశారు. కొత్త కార్డుల్లో 9,663 యూనిట్లు (లబ్ధిదారులు) నమ...