భారతదేశం, మార్చి 23 -- TG Ration Card Updates : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 30న ఉగాది రోజు నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మార్చి 30న హుజుర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు 6 కేజీలు సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84 శాతం మందికి సన్న బియ్యం అందుతాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారన్నారు.

కృష్ణా జలాల్లో నీటి కొరత ఉండటం వాస్తవమేనని మంత్రి ఉత్తమ్ తెలిపారు. శ్రీశైలం నుంచి కరెంట్ తయారుకు నీటిని విడుదల చే...