భారతదేశం, ఫిబ్రవరి 14 -- TG Ration Card Update : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ, మార్పుచేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. మీసేవా కేంద్రాల్లో కొత్త కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తుండడంతో...ప్రజలు భారీగా క్యూకడుతున్నారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందిస్తారు.

రేషన్ కార్డుల అప్డేట్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గత పదేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం లేకపోవడం...భారీగా ...