తెలంగాణ,హైదరాబాద్, మార్చి 26 -- రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను పట్టాలెక్కించే పనిలో పడింది. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సర్కార్ విడుదల చేసింది.

ఈ స్కీమ్ కింద 160 కి పైగా యూనిట్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రోస్, ట్రాన్స్ పోర్ట్ కేటగిరిలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అర్హతలకు అనుగుణంగా.. యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యూనిట్ పై ఎంత వరకు రాయితీ వస్తుందో కూడా వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ కు వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ పై...