తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 5 -- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. రాయితీతో కూడిన స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనుంది. రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే కాకుండా... ఆఫ్ లైన్ విధానంలో కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇక ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్‌ 14 వరకు పొడిగించారు. ముందుగా ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించినప్పటికీ.. ఆ తర్వాత ఆఫ్ లైన్ విధానంలో కూడా స్వీకరిస్తున్నారు. ఇలా పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను పై పత్రాలు జత చేసి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లోన...