తెలంగాణ,హైదరాబాద్, మార్చి 29 -- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను తీసుకువచ్చారు. రూ. ఆరు వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించగా.... అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఏప్రిల్ 5ను తేదీ గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తాయి. జూన్‌ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ...