భారతదేశం, మార్చి 17 -- తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద మార్చి 17 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ దరఖాస్తుల ప్రక్రియను ఇవాళ ప్రారంభించనున్నారు.

ఈ పథకానికి సంబంధించి.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పథకం విధివిధానాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు భట్టి.

రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్ప...