భారతదేశం, జనవరి 30 -- యూనివర్సిటీల ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచుతూ.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచాలని ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. దాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 2 వేల 817 ప్రొఫెసర్లు పనిచేయాలి. కానీ.. ప్రస్తుతం 757 ఆచార్యులే పని చేస్తున్నారు. దాదాపు 73 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పైగా కాకతీయ, ఉస్మానియా వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో పదవీ విరమణ పొందేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఖాళీల సంఖ్య మరింత...