భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఇన్నాళ్లు డాక్టర్ల దగ్గరకు వెళ్తే రోగం నయం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారు చేసే పనులు చూసి రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అడుగు పెట్టగానే రకరకాల పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా మందులు రాయడం, ఆపరేషన్లు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీంతో హెల్త్ కార్డు ఉన్నవారు, డబ్బున్న వారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితులు ఎర్పడ్డాయి.

పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే.. ఉన్న ఆస్తులు, అవయవాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు ప్రైవేట్ డాక్టర్లు కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా.. ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లకు పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేస్తున్నారు. అటు పట్టించుకునే వారు లేక.. డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఎక్కువ రేట్లు వసూలు చేస్తూ.. డబ్బులు లాగ...