తెలంగాణ,కరీంనగర్, జనవరి 29 -- పూజలకు ఉపయోగించి పూలు, వాడిపోయి పనికిరాని పూలు సువాసనలు వెదజల్లే అగరుబత్తులుగా మారుతున్నాయి. పుష్పాలతో అగరుబత్తీలు తయారు చేసే సరికొత్త ఒరవడికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వాడిన పూలతో అగరబత్తులు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించి ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా జైలులో ప్రారంభించారు.

జైలులో తయారు చేస్తున్న అగరు బత్తుల తయారీకి వాడిన పూలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. అత్తుక్కోవడానికి యారయార పౌడర్, మండడానికి రాళం పొడి (కర్పూరం పొడి), చెక్కపొడి, పూలను ఎండబెటి పౌడర్ కలుపుతున్నారు. ఖైదీలతో మ్యానువల్ మిషన్ ద్వారా రోజుకు 2500 నుంచి 3000 వరకు అగరుబత్తులు తయారు చేయిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్డర్లు పెరిగితే ఆటోమేషన్ మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని జైళ్ల శాఖ భావిస్తుంది. జైలుతో తయారు ...