తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 24 -- తెలంగాణ పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి(2025-26) సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్షను మే 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఆన్ లైన్ దరఖాస్తులు, ఫీజులు, ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ల జారీ తేదీ వంటి వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కసరత్తు పూర్తి చేసింది.

ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించనున్నారు. పదో తరగతి లేదా త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం టెన్త్ ప‌రీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాత‌ప‌రీక్షకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది.

తెలంగాణ పా...