భారతదేశం, ఏప్రిల్ 16 -- TG Plastic Rice: తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఫేక్‌ ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని సివిల్‌ సప్లైస్‌ అధికారులు ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.

గోదావరిఖని పెద్దపల్లి జిల్లా లోని తిలక్ నగర్ లో పంపిణీ చేసే సన్నబియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు ప్రచారం చేశారని, దీనిపై స్పందించిన జిల్లా పౌర సరఫరాల శాఖ స్పంద...