భారతదేశం, మార్చి 23 -- ఎస్ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని పిటిషన్‌లో వివరించారు. చికిత్స కోసమే అమెరికాకు వెళ్లినట్టు ప్రభాకర్‌ రావు స్పష్టం చేశారు. తననునిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికా వెళ్లినట్టు చెప్పారు. తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదన్న ఎస్ఐబీ మాజీ చీఫ్‌.. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎస్ఐబీ కేంద్రంగా విచ్చలవిడిగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని.. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లను ప్రభాకర్ రావు, అతని బృందం అక్రమంగా ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రయోజ...