భారతదేశం, ఫిబ్రవరి 16 -- తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ గతేడాది డిసెంబర్ 3న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 66 ఐటీ చట్టం - సమాచార సాంకేతిక నేరాల చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.

మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ.. చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆధారాలు లభించడంతో అరెస్టులు ప్రారంభించారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేసిన టి.వంశీకృష్ణ, అతడికి సహకరించిన టి.సంతోష్‌కుమార్‌, బి.పరశురాములును అరెస్టు చేశారు.

వీరికి న్యాయస్థానం ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించి...