భారతదేశం, ఏప్రిల్ 2 -- TG PDS Rice: పెద్దలు తినే సన్న బియ్యం బువ్వా, ఇప్పుడు పేదలకు సైతం లభిస్తుండడంతో తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సంబరపడుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా 17263 రేషన్ షాపుల్లో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ ప్రారంభం అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 91 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల సన్నబియ్యం పంపిణీని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇకనుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు.

కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇస్తామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం పట్ల నిరుపేదలు లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇదివరకు దొడ్డిబియ్యం తినలేక వాటిని అమ్ముకుని సన్నబియ్యం...