భారతదేశం, ఫిబ్రవరి 2 -- TG Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన...కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రకటన కోసం క్షేత్రస్థాయిలో నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పార్టీలు, స్థానిక నేతలు ప్రచార కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణమైన ప్రకటన రావొచ్చన్న సమాచారంతో ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.

కులగణన చేపట్టాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు ముందు నుంచీ చెబుతున్నారు. తాజాగా కులగణన సర్వే నివేదిక సిద్ధమైంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కులగణన సర్వే రిపోర్టును అందుక...