తెలంగాణ,హైదరాబాద్, మార్చి 22 -- ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చేసింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.

ఈ స్కీమ్ కింద ఉపకారవేతనాలకు మార్చి 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన వారు ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అర్హులైన వారు తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్య...