భారతదేశం, ఫిబ్రవరి 14 -- కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు మీసేవ కేంద్రాలకు కూకట్టారు. ప్రభుత్వం ఎలాంటి గడువు విధించకపోయినా.. మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఇదే అదునుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారు.

రేషన్ కార్డు దరఖాస్తు ఫీజును రూ.50గా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. చాలా సెంటర్లలో నిర్ణయించిన ఫీజు కంటే.. రూ.100 నుంచి రూ.800 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే తీసుకో.. లేకపోతే పో.. అంటూ మీసేవ నిర్వాహకులు గద్దిస్తున్నారు. దీంతో చేసేదెం లేక.. ప్రజలు అడిగినంత ఇస్తున్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి.. ఎలా చేయాలో తెలియక ...