తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 7 -- కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు కూడా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు పాత రేషన్ కార్డుల విషయంలోనూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించింది. ఫలితంగా పేరు మార్పులే కాకుండా కొత్త సభ్యులను కూడా చేర్చుకునే వీలు ఉంటుంది.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో కొత్త కార్డులను జారీ చేశారు. అయ...