భారతదేశం, ఫిబ్రవరి 8 -- TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని ప్రచారం జరిగింది. కొత్త తెల్ల రేషన్ కార్డులకు మీసేవలో అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారం అవాస్తమని సీఈసీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే వారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు, మార్పుచేర్పుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా మీసేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప...