తెలంగాణ,హైదరాబాద్, జనవరి 18 -- తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపే అర్హులను గుర్తించే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా.. జిల్లాల వారీగా కొత్త కార్డులకు ఎవరు అర్హులుగా ఉన్నారనే దానిపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక వివరాలతో కూడిన జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎంతో కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో అనేక మంది దరఖాస్తులు ఇచ్చారు. నిర్ణీత ఫామ్ లో కాకుండా. తెల్ల కాగితంపైనే రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ఇచ్చారు. అయితే వీటి విషయంలో సర్కార్ నుంచి అధికారికంగా క్లారిటీ రా...