భారతదేశం, మార్చి 4 -- TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్ ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఖరారు చేశారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డును తయారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాను ఖరారు చేశారు. రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులై...