భారతదేశం, జనవరి 21 -- TG New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారభించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో కొత్త రేషన్ కార్డులు ఒకటి. సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఎంతో కీలకం. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులకు ఎంపికైన వారి పూర్తి స్థాయి జాబితాలు విడుదల కానున్నాయి. అయితే పలుచోట్ల అధికారుల అత్యుత్సాహంలో జాబితాలు లీక్ అయ్యాయి. వీటిల్లో తమ పేర్లు లేమని ప్రజలు గగ్గోలుపెడుతున్నాయి. జాబితాల్లో పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు అర్హులను గ్రామసభల్లో నిర్ణయిస్తామని అధికారులు ప్రకటించారు.

రేషన్ కార్డుల జ...