భారతదేశం, జనవరి 22 -- TG New Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 26న ఈ నాలుగు కొత్త పథకాలను ప్రారభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిన్నటి నుంచి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తూ...లబ్దిదారుల జాబితాలు ప్రకటిస్తున్నారు అధికారులు. జాబితాల్లో పేర్లు లేనివాళ్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభల్లో పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామన్నారు.

రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదలందరికీ రేషన్ కార్...