తెలంగాణ,హైదరాబాద్, జనవరి 22 -- తెలంగాణలో మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ. వాటిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవలే నిర్వహించిన కుటుంబ సర్వే ఆధారంగా. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ సర్వే ఆధారంగా.. కొన్ని పేర్లతో కూడిన జాబితాలు వచ్చాయి.

కుల గణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలే కాకుండా.గతంలో మీసేవా ద్వారా అప్లికేషన్లు చేసుకున్న వారిలో కూడా కొంతమంది పేర్లను గుర్తించారు.ఆ జాబితాలను కూడా గ్రామాలవారీగా ప్రకటించారు. అయితే చాలా మంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరించే పనిలో పడింది. ఈ ప్రక్రియ జనవరి 21వ తేదీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది....