భారతదేశం, మార్చి 2 -- కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. తీర్మానం చేశారు. అటు నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కులగణనపై పలు సందేహాలు ఉన్నాయని.. ప్రతి గ్రామంలో కులగణన వివరాలు ప్రభుత్వం ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.

మున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని నేతలు అభిప్రాయపడ్డారు. అందుకు ప్రత్యేకంగా కులం తరుపున సర్వే కమిటీ వేసుకున్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ను కో ఆపరేటివ్ సొసైటి లాగా తుతూ మంత్రంగా ఏర్పాటు చేశారని.. పూర్తి స్థాయి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించాలని నిర్ణయించారు.

మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సర...