భారతదేశం, ఫిబ్రవరి 13 -- దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. 20వార్డులకు గాను 10 చోట్ల బిఆర్ఎస్ గెలవగా. బిజెపి ఒకటి దక్కించుకుంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 4, 5,11,14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం నమోదైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ సుధాకర్.. కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగేష్‌పై 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

జుక్కల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కోహీర్, అలంపూర్, కేసముద్రంలో హంగ్ నెలకొంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి...