తెలంగాణ,హైదరాబాద్, మార్చి 9 -- తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును పొడిగించటంతో పాటు ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీని మార్చారు. ఈ మేరకు వివరాలను ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 13వ తేదీన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 10వ తేదీతో పూర్తి కానుంది. అయితే దరఖాస్తుల గడువును మార్చి 20వ తేదీ వ...