తెలంగాణ,కరీంనగర్, మార్చి 2 -- ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కు అధికారులు కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ తో కలిసి కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పిజియన్ బాక్స్ లను, సీసీ కెమెరాలను పరిశీలించారు.

మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాతుందని తెలిపారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల కోసం 14 టేబుళ్ళు సిద్ధం చేస్తున్నట్లు ప్ర...