తెలంగాణ,కరీంనగర్,మెదక్, ఫిబ్రవరి 26 -- మెదక్- -నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 15 జిల్లాలలో మొత్తం 773 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఫిబ్రవరి 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులకు సిబ్బందికి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ...